Air · Rasi prediction

Libra తులా · Tula

Explore the yearly, monthly and daily guidance for Tula rasi, written by our astrologers from classical Vedic principles.

  • Sep 23 – Oct 22
  • Air
  • Ruling planet: Venus

Forecast

Libra Prediction

2026
Yearly Forecast Vedic forecast · 2026

స్వస్తి శ్రీ వికారి నామ సంవత్సర తులారాశి గోచార ఫలము

చిత్త 3,4 పాదము, స్వాతి 1,2,3,4 పాదము, విశాఖ 1,2,3 పాదము. రా, రి, రూ, రే, రో, తా, తి, తు, తే అక్షరాు కసి తులారాశి అగును. ద్వంద్వాక్షర పేర్లు : స్రవంతి, శ్రావన్‌, భ్రమరాంబ, ప్రణిత, శ్రీధర్‌, శ్రీనివాస్‌, శ్రీనిది, బ్రహ్మచారి,బ్రహ్మ ప్రభాకర్‌, ప్రనిత, రైవతుడు, రౌదృడు, ద్రౌపతి, త్రిశంకుడు, దృపదుడు శ్రేష్టుడు, ద్రోణుడు, ద్రోనాచారి
గురువారం ఘాతవారం. ఆధాయం 08, వ్యయం 08, రా.పూజ్యం 07, అవమానం 01


ఈ రాశివారి జాతక లక్షణాలు వేద బ్రాహ్మణులను సాదుసత్పురుషులను, గురువులను పూజించువారు. ప్రతిభావంతులు, కండబలం కన్నా గుండెబలం పెద్దది, దేహ బలం కన్నా బుద్ధి బలం ఎక్కువ, ఇతరుల సహాయ సహకారం లేక స్వయం కృషితో డబ్బు సంపాదించును. ధనవంతులు, గుణవంతులు, వ్యాపారం నందు నైపుణ్యత గలవారును. ఇతనికి ప్రధమ నామధేయంగాక ద్వితీయ నామదేయముతో పిలువబడుతారు. బంధువులకు ఉపకారం చేయువారు. వాస్తు జ్యోతిష్యం, పాండిత్యం గలవారు.
ఈ జాతకులకు 06-04-2019 శనివారం నుండి 05-11-2019 మంగళవారం వరకు గురుడు 2వ స్థానంలో ఉండుట వలన కలిగే ఫలితాలు ఈ ప్రకారముగా జరుగును.

శ్లో॥మనస్సౌక్యైం యశోవృద్ధి సౌభాగ్యంచ ధనాగమః। ధర్మవ్యయం మనసౌఖ్య ద్వితీయస్థానకే గురౌ॥

నేత్ర సంబంధమైన బాధతొలుగును. మనస్సున ఆనందము, ఇతరు వద్ద పలుకుబడి పెరుగుట ధనలాభము కలుగుట మనస్సున తలచిన పనులు నెరవేరుట ధర్మ కార్యములు చేయుట మొదలగు శుభఫలితము కలుగును. అనుకున్నవి సాధించుట ఇంట్లో శుభకార్యాలు చేయుట ఇతరుల శుభాకార్యాలు జరిపించుట. భూమికొనడం లేక అమ్మడం గృహనిర్మాణం చేస్తారు.
06-04-2019 శనివారం నుండి 25-01-2020 శనివారం వరకు శని 3వ స్థానంలో ఉండుట వలన కలిగే ఫలితాలు

శ్లో॥ స్త్రీభోగంచ మనసౌఖ్యం బుద్ధి యత్నాది సిద్ధికృత్‌। స్వస్థానాం ప్రాప్తిమారోగ్యం రవిపుత్ర తృతియస్థానే శనౌ॥

సోదరులతో మంచి సంబందము నెలకొంటాయి. స్త్రీ సౌఖ్యము మనస్సున తలచిన పనులు నెరవేరుటయు మనస్సున సంతోషము కలుగుటయు బుద్ధి బలమును పెంచుకొనుటయు పనులయందు జయము స్వగ్రామము యందు సౌఖ్యజీవనము అనుకున్న పనులు నెరవేరుటయు మనోల్లాసముగాయుండుటయు రావలసిన ధనం చేతికందుతుంది. లక్ష్మినారాయణ యంత్రం, శ్రీసుదర్శనయంత్రం ప్రతిష్ఠించుకొండి.
05-11-2019 మంగళవారం నుండి 25-03-2020 బుధవారం వరకు గురుడు 3వ స్థానంలో ఉండుట వలన కలిగే ఫలితాలు

శ్లో॥ అతిక్లేశం బంధవైర్యం ధారిద్రదేహపీడం ।ఉద్యోగ బంగహాకలాహం తృతీయ స్థానకే ద్గురౌ॥

మనోవిచారము సోదరులతో విరోదము బంధువిరోధము, ధనముగూర్చి ఇబ్బందు పడుటయు ధైర్యము సన్నగ్లిుటయు ప్రతిపనికి భయపడుటయు కోర్టు వ్యవహారాదు అనుకూలించకుండుటయు అదృష్టమునకు దూరమగుటయు, భార్యతో మనస్పర్ధులు వచ్చుటయు శరీరము సహజత్వము కోల్పోవుటయు జరుగును. శని ఈ సంవత్సరమంతా మకర రాశిలో ఉన్నందున శనికి తైలాభిషేకం శనిధానము ఇచ్చిన శాంతించును
25-01-2020 నుండి శని 4వ స్థానంలో సంవత్సరమంతా ఉండుట వలన కలిగే ఫలితాలు

శ్లో॥వ్యాధిపీడ ప్రవాసంచ అంతక్లేశం మహద్భయం । అపమృత్యు భయం ప్రాప్తి అర్థాష్టమ స్థానకే శనౌ ॥

శుభ కార్యక్రమములు చేయుట వలన ధన వ్యయము పాడి పరిశ్రమ అనుకూలించక పోవుట స్థానచనము ఉద్యోగుకు బదిలీలు తరుచు ప్రయాణము అప్పు చేయుట మలిన వస్త్రధారణ చేయుట మరియు కుటుంబ చిక్కులు ఆర్థిక ఇబ్బందులు అనుకున్నవి వాయిదాపడుట మనకు రావసిన డబ్బులు రాకపోవుడం ఇచ్చేకాడ సతాయించడం జరుగును. ఇంట్లో ఒకరిమాట ఒకరు వినకపోవడం అనారోగ్యము కలుగును. శనికి 1 1/4 కిలో నువ్వులు , 2 1/2 మేటర్ల నల్ల వస్త్రము శనివారం పూరోహితునికి దానం ఇవ్వండి
అన్ని వృత్తులవారికి ఈ సంవత్సరము మధ్యమ ఫలితము ఉండును. డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, సిని నటినటులు ఘణసన్మానము అందుకోనును. నాట్యకళా రంగస్థ మరియు వేదపండితులు ఘణసన్మానము పొందును. విద్యార్ధులకు మంచి ఫలితాలు ఉండును. వ్యాపారులకు వ్యవసాయదారులకు ధనలాభం కలుగును.


చిత్త వారికి లక్కీ నెం.5-6-9, లక్కీ స్టోన్‌ పగడం ధరించాలి. స్వాతి వారికి లక్కీ నెం.4-6, లక్కీ స్టోన్‌ గోమేధికం ధరించాలి. విశాఖ వారికి లక్కీ నెం.3-6-9, లక్కీ స్టోన్‌ కనకపుష్పరాగం ధరించాలి. తులారాశి వారందరికి శుక్రవారం మంచిది.
గురువారం ఘాత.
మీరు పూజించే భగవంతుడు శ్రీరాముడు. ఓం తత్వనిరంజనాయ తారక రామాయనమ: రోజుకు 27 సార్లు మీరు ప్రతి దినం పఠించాలి

మీరు ప్రతి రోజూ పఠించే విష్ణు సహస్రనామ శ్లోకము
శ్లో॥ జీవో వినయితా సాక్షీ ముకున్దో2మిత విక్రమః।
అమ్భోనిధి రనన్తాత్మా మహోదధిశయో2 న్తకః ॥ (చిత్త 3 పా)
శ్లో॥ అజో మహార్హః స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః ।
ఆనన్దో నన్దనో2 నన్దః సత్యధర్మా త్రివిక్రమః॥ (చిత్త 4 పా)
శ్లో॥ మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః ।
త్రిపదస్త్రిదశాధ్యక్షః మహాశృఙ్గః కృతాన్తకృత్‌ ॥ (స్వాతి 1 పా)
శ్లో॥ మహావరాహో గోవిన్దః సుషేణః కనకాఙ్గదీ ।
గుహ్యాగభీరో గహనో గుప్తశ్చక్ర గదాధరః ॥ (స్వాతి 2 పా)
శ్లో॥ వేధాస్స్వాంగో2 జితః కృష్ణో దృఢస్సఙ్కర్షణో2 చ్యుతః ।
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః ॥ (స్వాతి 3 పా)
శ్లో॥ భగవాన్‌ భగహానన్దీ వనమాలీ హలాయుధః ।
ఆదిత్యో జ్యోతిరాదిత్యః సహిష్ణుర్గతిసత్తమః ॥ (స్వాతి 4 పా)
శ్లో॥ సుధన్వా ఖణ్ణపరశుః దారుణో ద్రవిణః ప్రదః ।
దివస్పృక్సర్య దృగ్వ్యాసో వాచస్పతి రయోనిజః ॥ (విశాఖ 1 పా)
శ్లో॥ త్రిసామా సామగస్సామ నిర్వాణం భేషజం భిషక్‌ ।
సన్యాసకృఛమశ్శాన్తో నిష్ఠాశాన్తిః పరాయణః ॥ (విశాఖ 2 పా)
శ్లో॥ శుభాంగశ్శాన్తిదస్స్రష్టా కుముదః కువలేశయః ।
గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః ॥ (విశాఖ 3 పా)
Back to top