Air · Rasi prediction

Aquarius కుంభం · Kumbha

Explore the yearly, monthly and daily guidance for Kumbha rasi, written by our astrologers from classical Vedic principles.

  • Jan 20 – Feb 18
  • Air
  • Ruling planet: Saturn

Forecast

Aquarius Prediction

2026
Yearly Forecast Vedic forecast · 2026

స్వస్తి శ్రీ వికారి నామ సంవత్సర కుంభ రాశి గోచార ఫలము

ధనిష్ట 3,4 పాదము, శతభిష: 1,2,3,4 పాదము, పూర్వాభాద్ర 1,2,3 పాదము. గూ, గే, గో, సా, సి, సూ, సే, సో, దా అక్షరాు కలిపి కుంభరాశి అగును. ద్వంద్వాక్షర పేర్లు : దైవజ్ఞ, దైత్యుడు, దౌహితృడు
గురువారం ఘాతవారం. ఆధాయం 05, వ్యయం 02, రా.పూజ్యం 05, అవమానం 04


ఈ రాశివారి జాతక లక్షణాలు సుదీర్ఘమైన, సుందరమైన మెడలు కలిగి, అందమైన శరీరము, సుందరముగా, ఆనందముగా ఉండును. కొన్ని సంవత్సరాలు ధన సంపతితోను, మరికొన్ని సంవత్సరాలు దరిద్రముతోను ఉండును. పుణ్యక్షేత్రము, గార్డెన్‌, పూ తోటు, బృందావనం అంటే చాలా ఇష్టము కలవారు. మంచి స్నేహం కలవారు. సాదు సత్పురుషుతో మంచి పేరున్న వ్యక్తులతో పరిచయం. దీర్ఘముగా ఆలోచించువారు అగును.
ఈ జాతకులకు 06-04-2019 శనివారం నుండి 05-11-2019 మంగళవారం వరకు గురుడు 10వ స్థానంలో ఉండుట వలన కలిగే ఫలితాలు ఈ ప్రకారముగా జరుగును.

శ్లో॥ ధాన్యనాశో ధనచ్ఛేదః హృదాసంచరణ భయం। స్వజనై ర్ధూశనం చ్చైవ దశమాస్తే యదౌ గురౌ ॥

ధనధాన్య నష్టము అనవసర వాహణ ప్రయాణములో ప్రమాధములు కలుగును, మనస్సున భయము కలుగుట బంధు జనులను ధూషించుట కలహము వచ్చుట శరీరమున వాతరోగము ప్రవేశించుట,కుటుంబ చిక్కులు, ఆర్ధిక ఇబ్బందులు, అనుకున్న పనులు వాయిదా పడటము జరుగును, ప్రయాణములో చాలా జాగ్రత్త అవసరము. ఉద్యోగులకు బదిలీలు కలుగుట, సంతానముతో విరోదము ప్రభు సన్మానము రాక పోవుట, రాచకార్యవిరోదము, ఉద్యోగస్థులకు ఉద్యోగము లభించక పోవుట మొదలగు చెడుఫలితాలు కలుగును. మీఇంట్లో లక్ష్మీకుబేరయంత్రం ప్రతిష్ఠించుకోండి
06-04-2019 శనివారం నుండి 25-01-2020 శనివారం వరకు శని 11వ స్థానంలో ఉండుట వలన కలిగే ఫలితాలు

శ్లో॥ ఆరోగ్యం అర్ధలాభశ్ఛ స్త్రీపుత్ర సుఖవర్ధనం । చిత్తశుద్ధి రభీóష్టార్ధం ఏకాదశ స్థానగే శనౌ ॥

ధనలాభము, చేయు వృత్తి వ్యాపారము యందు అభివృద్ధి, ప్లాటు కొనడము,భూమి కొనడము,గృహనిర్మాణము, ఇంట్లో శుభకార్యములు చేయడం జరుగును. భూలాభము ఏపనిచేసిననూ ధనలాభము కుటుంబ సౌఖ్యము ఆరోగ్యవృద్ధి సంతానప్రాప్తి సంతోషము ప్రయత్నించిన పనులు నెరవేరుటయు తన మాట ఇతరులు వినుటయు జరుగును. విద్యార్థులు మంచి మార్కులో ఉత్తీర్ణులు యగుదురు పెద్దల మన్ననను పొందుదురు. ఉద్యోగులకు పదోన్నతులు కలుగుతాయి. వ్యవసాయదారులకు వ్యవసాయం అనుకూలిస్తుంది.
05-11-2019 మంగళవారం నుండి 25-03-2020 బుధవారం వరకు గురుడు 11వ స్థానంలో ఉండుట వలన కలిగే ఫలితాలు

శ్లో॥ యశోవృద్ధి బలంతేజః సర్వత్ర విజయం స్సుఖం।శేతృహం తిరుమంత్రం సిద్ధిః ఏకాదశ స్థాకే గురౌ॥

గృహలాభము, కులాచారము యందు శ్రద్ధ ధనలాభము అయాచితముగా ధనము లభించుట పరస్త్రీ సౌఖ్యము మంచి భోజనము సంతోషముగా జీవించుట బుద్ధి బలము సొంతగ్రామము యందు సౌఖ్య జీవనము మనస్సున తలచిన పనులు నెరవేరుట ఆరోగ్యము పశు ధాన్యలాభము తండ్రికి ఆరోగ్యము కలుగుట పిత్రార్జిత ఆస్థి కలసి వచ్చుటయు జరుగును.
25-01-2020 నుండి శని 12వ స్థానంలో సంవత్సరమంతా ఉండుట వలన కలిగే ఫలితాలు

శ్లో॥ మనహాని మనః క్లేశం కృషి ర్భోజన మ్పషం । నిత్యసంసార దారిద్య్రం ద్వాదశ స్థానకే శనౌ ॥

12వ స్థానంలో సాడేసాత్‌శని ప్రారంభమగుట వలన సంపాదన తగ్గును ఖర్చుపెరుగును. ఆర్థిక ఇబ్బందులు అధికమగును. ధనహాని, వృధాప్రయాస, అనుకున్న పనులు కాకపోవుట, ఇంట్లో ఒకరిమాట ఒకరు వినకపోవుట, ఇంట్లో అనారోగ్యబాధలు, మిత్రుతో విరోధాలు, చెయ్యనినేరాలు మీదపడుట మొదలగు దృష్పలితాలు కలుగును.
విద్యార్ధులకు మంచి ర్యాంక్ , ఉద్యోగస్తులకు కృషి ముఖ్యం , వ్యాపారస్తులకు స్వల్ప లాభం,డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, సిని నటినటులు ఘణసన్మానము అందుకోనును. నాట్యకళా రంగస్థ మరియు వేదపండితులు ఘణసన్మానము పొందును.


ధనిష్ఠ వారికి లక్కీ నెంబర్‌లు 8-9, లక్కీ స్టోన్‌ పగడం ఉంగరం ధరించాలి. శతభిషం వారికి లక్కీ నెం.8-4, లక్కీ స్టోన్‌ గోమేధికం ఉంగరం ధరించాలి. పూర్వాభాద్ర వారికి లక్కీ నెం.8-3, లక్కీ స్టోన్‌ పుష్పరాగం. లక్కీ వారం శుక్రవారం. గురువారం ఘాత. మీరు నిత్యం పూజించే భగవంతుడు శ్రీమన్నారాయణుడు. ఓం శ్రీం ఉపేంద్రాయ అచ్యుతాయ నమ: రోజుకు 27 సార్లు పఠించాలి
మీరు ప్రతి రోజూ పఠించే విష్ణు సహస్రనామ శ్లోకము
శ్లో॥ భారభృత్‌ కథితో యోగీ యోగీశ స్సర్వ కామదః ।
ఆశ్రమ శ్శ్రమణః క్షామః సువర్ణో వాయు వాహనః ॥ (ధనిష్టా 3 పా)
శ్లో॥ ధనుర్ధరో ధనుర్వేదో దణ్డో దమయితా22దమః ।
అపరాజిత స్సర్వసహో నియన్తా22 నియమో2 యమః ॥ (ధనిష్టా 4 పా)
శ్లో॥ సత్త్వవాన్‌ సాత్విక్‌ స్సత్యః సత్యదర్మ పరాయణః ।
అభిప్రాయః ప్రియార్హోర్హః ప్రియకృత్‌ ప్రీతివర్దనః ॥ (శతభిష 1 పా)
శ్లో॥ విహాయసగతి ర్జ్యోతిః సురుచిర్హుతభుగ్విభుః ।
రవి ర్విరోచన స్సూర్యః సవితా రవి లోచనః॥ (శతభిషం 2 పా)
శ్లో॥ అనన్తో హుతభుగ్భోక్తా సుఖదో నైకజో2 గ్రజః ।
అనిర్విణ్ణ స్సదామర్షీ లోకాధిష్ఠాన మద్భుతః ॥ (శతభిషం 3 పా)
శ్లో॥ సనా త్సనాతనతమః కపిః కపిరవ్యయః ।
స్వస్తిద స్స్వస్తికృత్‌ స్వస్తి స్వస్తిభుక్‌ స్వస్తిదక్షిణః ॥ (శతభిషం 4 పా)
శ్లో॥ అరౌద్రః కుణ్డలీ చక్రీ విక్రమూర్జిత శాసనః ।
శబ్దాతిగ శ్శబ్దసహః శిశిర శ్శర్వరీకరంః ॥ (పూర్వాభాద్ర 1 పా)
శ్లో॥ అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః ।
విద్వత్తమో వీతభయః పుణ్యోశ్రవణ కీర్తనః ॥ (పూర్వాభాద్ర 2 పా)
శ్లో॥ ఉత్తారణో దుష్క ృతిహా పుణ్యో దుస్స్వప్న నాశనః ।
వీరహా రక్షణ స్సన్తో జీవనః పర్యవస్థితః ॥ (పుర్వాభాద్ర 3 పా)
Back to top