Earth · Rasi prediction

Capricorn మకరం · Makara

Explore the yearly, monthly and daily guidance for Makara rasi, written by our astrologers from classical Vedic principles.

  • Dec 22 – Jan 19
  • Earth
  • Ruling planet: Saturn

Forecast

Capricorn Prediction

2026
Yearly Forecast Vedic forecast · 2026

స్వస్తి శ్రీ వికారి నామ సంవత్సర మకర రాశి గోచార ఫలము

ఉత్తరాషాఢ 2,3,4 పాదము, శ్రవణం 1,2,3,4 పాదము, ధనిష్ఠ 1,2 పాదము. భో, జా, జీ, జు, జే, జో, ఖ, గా, గీ అను అక్షరాు కలిపి మకరరాశి అగును. ద్వంద్వాక్షర పేర్లు : గౌరిదేవి, గైరికము, గౌతముడు, గౌరీశ్వర్‌, గౌరిశంకర్‌, గౌరీశ్వరి
మంగళవారం ఘాతవారం.ఆధాయం 05, వ్యయం 02, రా.పూజ్యం 02, అవమానం 04


ఈ రాశివారి జాతక లక్షణాలు భార్య పుత్రులను ప్రేమించువారు. దాన ధర్మము చేయువారు. ధర్మ కార్యములు చేయును. ధనము సంపాదించి వృదాగా ఖర్చు చేయువారు. కృషించిన తొడు గలవారు. మంచి విశామైన కన్ను కలవారు. చెప్పినంత మాత్రముననే గ్రహించు స్వభావము గలవారు. మహాతెలివి తేటులు కలవారు. వేద బ్రాహ్మణ భక్తి గలవారు. హీన జాతి స్త్రీను గౌరవించువారు. దయాదాక్షిణ్యం గలవారు. కార్యశీలుడు కర్మనిరతుడు. పుత్రసంతానము గలవారు. ఏకసంత గ్రహిణి పెద్దలను గౌరవించును. తల్లిదండ్రును, గురువును పూజించువారు. పెద్ద పెద్ద వారిచే ఘనసన్మానం పొందువారు. మితముగా, హితముగా మాట్లాడుదురు.
ఈ జాతకులకు 06-04-2019 శనివారం నుండి 05-11-2019 మంగళవారం వరకు గురుడు 11వ స్థానంలో ఉండుట వలన కలిగే ఫలితాలు ఈ ప్రకారముగా జరుగును.

శ్లో॥ యశోవృద్ధి బంతేజః సర్వత్ర విజయం స్సుఖం।శేతృహం తిరుమంత్రం సిద్ధిః ఏకాదశ స్థాకే గురౌ॥

గృహలాభము, కులాచారము యందు శ్రద్ధ ధనలాభము అయాచితముగా ధనము లభించుట పరస్త్రీ సౌఖ్యము మంచి భోజనము సంతోషముగా జీవించుట బుద్ధి బలము సొంతగ్రామము యందు సౌఖ్య జీవనము మనస్సున తలచిన పనులు నెరవేరుట ఆరోగ్యము పశు ధాన్యలాభము తండ్రికి ఆరోగ్యము కలుగుట పిత్రార్జిత ఆస్థి కలసి వచ్చుటయు జరుగును.
06-04-2019 శనివారం నుండి 25-01-2020 శనివారం వరకు శని 12వ స్థానంలో ఉండుట వలన కలిగే ఫలితాలు

శ్లో॥ మనహాని మనః క్లేశం కృషి ర్భోజన మ్పషం । నిత్యసంసార దారిద్య్రం ద్వాదశ స్థానకే శనౌ ॥

12వ స్థానంలో సాడేసాత్‌శని ప్రారంభమగుట వలన సంపాదన తగ్గును ఖర్చుపెరుగును. ఆర్థిక ఇబ్బందులు అధికమగును. ధనహాని, వృధాప్రయాస, అనుకున్న పనులు కాకపోవుట, ఇంట్లో ఒకరిమాట ఒకరు వినకపోవుట, ఇంట్లో అనారోగ్యబాధలు, మిత్రుతో విరోధాలు, చెయ్యనినేరాలు మీదపడుట మొదలగు దృష్పలితాలు కలుగును.
05-11-2019 మంగళవారం నుండి 25-03-2020 బుధవారం వరకు గురుడు 12వ స్థానంలో ఉండుట వలన కలిగే ఫలితాలు

శ్లో॥ శుభమూలే వ్యామోహం ఛైవ ప్రాణవిక్రయ ధూషణం। స్థానభ్రష్టంచ దారిద్య్రయం ద్వాదశ స్థానే గురౌ ॥

శుభ కార్యక్రమములు చేయుట వలన ధన వ్యయము పాడి పరిశ్రమ అనుకూలించక పోవుట స్థానచలనము ఉద్యోగులకు బదిలీలు తరుచు ప్రయాణము అప్పు చేయుట మలిన వస్త్రధారణ చేయుట మరియు కుటుంబ చిక్కులు ఆర్థిక ఇబ్బందులు అనుకున్నవి వాయిదాపడుట మనకు రావలసిన డబ్బు రాకపోవడం, ఇచ్చేకాడ సతాయించడం జరుగును. ఇంట్లో ఒకరిమాట ఒకరు వినకపోవడం అనారోగ్యము, మీతో సహాయ సహాకారము పొందిన వారు మీకు శత్రువులు అగుదురు.
25-01-2020 నుండి శని 1వ స్థానంలో సంవత్సరమంతా ఉండుట వలన కలిగే ఫలితాలు

శ్లో॥ తేజోహాని మతీబ్రంశ ఘణపీడ భయం తధాః। రోగార్ధి బంధువైరంచ వ్యసనం జన్మకే శనౌ॥

అపకీర్తి భార్యాపుత్రులతో విరోదము చంచల బుద్ధియు మనస్థాపము భయము కలుగుట శరీరము యందు వాతాధిక్యత బంధు మిత్రవిరోదము సేవకావృత్తి వలన జీవనము చేయువృత్తి ఉద్యోగ వ్యాపారము ఆశించిన స్థాయిలో యుండకుండుట తలపెట్టిన పనులు ఆటంకము ఏర్పడుట విద్యార్థులకు విద్యాభంగము కలుగుటయు మొదలగు చెడుఫలితాలు కలుగును,
శనికి 1 1/4 కిలో నువ్వులు , 2 1/2 మేటర్ల నల్ల వస్త్రము శనివారం పూరోహితునికి దానం ఇవ్వండి
అన్ని వృత్తులవారికి ఈ సంవత్సరము మధ్యమ ఫలితము ఉండును. డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, సిని నటినటులు ఘణసన్మానము అందుకోనును. నాట్యకళా రంగస్థల మరియు వేదపండితులు ఘణసన్మానము పొందును. విద్యార్ధులకు మంచి ఫలితాలు ఉండును. వ్యాపారులకు వ్యవసాయదారులకు ధనలాభం కలుగును.


ఉత్తరాషాఢ వారికి లక్కీ నెంబర్లు 1-3-8-9, లక్కీ స్టోన్‌ కెంపు ఉంగరం ధరించాలి. శ్రవణం వారికి లక్కీ నెం.2-8, లక్కీ స్టోన్‌ ముత్యం ఉంగరం ధరించాలి. ధనిష్ఠ వారికి లక్కీ నెంబర్లు 9-8, లక్కీ స్టోన్‌ పగడం ఉంగరం ధరించాలి. లక్కీ వారము ఆది, సోమ, బుధవారము మంచివి. శని, మంగళవారాలు ఘాత. మీరు నిత్యం పూజించే భగవంతుడు శ్రీమన్నారాయణ.
ఓం శ్రీం వత్సరాయనమ: రోజుకు 108 సార్లు పఠించండి.
మీరు ప్రతి రోజూ పఠించే విష్ణు సహస్రనామ శ్లోకము
శ్లో॥ చతుర్మూర్తి శ్చతుర్భాహుః చతుర్వూ ్యహః చతుర్గతిః ।
చతురాత్మా చతుర్భావః చతుర్వేదవిదేకపాత్‌ ॥ (ఉత్తరాషాఢ 2 పా)
శ్లో॥ సమావర్తో2 నివృత్తాత్మా దుర్జమో దురతిక్రమః ।
దుర్లభో దుర్గమో దుర్గో దురావాసోదురారిహా ॥ (ఉత్తరాషాఢ 3 పా)
శ్లో॥ శుభాంగో లోకసారంగః సుతస్తు స్తన్తువర్ధన ః ।
ఇన్ధ్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః ॥ (ఉత్తరాషాఢ 4 పా)
శ్లో॥ ఉద్భవ స్సుందర స్సున్దో రత్ననాభ స్సులోచనః ।
అర్కో వాజసని శృంగీ జయన్తః సర్వవిజ్ఞయీ ॥ (శ్రవణ 1 పా)
శ్లో॥ సువర్ణ బిందురక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః ।
మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః ॥ (శ్రవణ 2 పా)
శ్లో॥ కుముదః కున్దరః కుందః పర్జన్యః పావనో2 నిః ।
అమృతాశో2 మృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః ॥ (శ్రవణ 3 పా)
శ్లో॥ సుభ స్సువ్రత స్సిద్ధః శత్రుజి చ్ఛత్రుతాపనః ।
న్యగ్రోధోదుమ్బరో2 శ్వత్థః చాణూరాన్ద్ర నిషూదనః ॥ (శ్రవణ 4 పా)
శ్లో॥ సహస్రార్చి స్సప్తజిహ్వః సప్తైథా స్సప్తవాహన ః ।
అమూర్తి రనగో2 చిన్త్యోభయకృద్భయనాశనః ॥ (ధనిష్టా 1 పా)
శ్లో॥ అణు ర్బృహ త్క ృశః స్థూలో గుణభృన్నిర్గుణోమహాన్‌ ।
అధృత స్స్వధృత స్స్వాస్థ్యః ప్రాగ్వంశో వంశవర్ధనః ॥ (ధనిష్టా 2 పా)
Back to top